ఎంత ఆర్తిగా
హత్తుకుంటాయి నీ తలపులు ?
ఎన్నో రాత్రులని
దొర్లించేస్తూ
ఒకోసారి
మదికి నీ చల్లని స్పర్శేదో తాకినట్లుంటుంది
మరోసారి
చెమ్మగిల్లిన చూపులు చూస్తుంటుంది
కొన్ని నిర్జీవక్షణాలని
ఒంపుకుంటూ
నిశబ్ద సంగీతాలు
నన్నావరిస్తుంటే
కొన్ని ఆకులు
రాల్చిన ఆ చెట్టు పై
నల్లని వెన్నెలని
చూస్తుంటా
కొన్ని రాత్రులని
దగ్ధం చేసి
వెలుతురు
కోసం ఎదురుచూస్తూ
కొన్ని తీపి
సముద్రాల్ని తాగి
ఊరడించుకుంటా నువ్వొచ్చేస్తావని
జీవించడం
నేర్పిన నువ్వు
నువ్వు లేకుండా
ఎలా బ్రతకాలో చెప్పలేదు
వియోగపు అనుభూతులు మధురమే
నా గుండె
నీ జ్ఞాపకాల సవ్వడి చేస్తున్నంతవరకు...
No comments:
Post a Comment